ASR: పెదబయలు మండలం రాసగుప్ప గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో తాగునీటి సౌకర్యం లేక దూరంగా ఉన్న వాగు నుంచి ఊట నీటిని తెచ్చుకుంటున్నామని బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారు 30కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.