సినిమా సినిమాకు సరికొత్తగా మేకోవర్ అవుతుంటాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకో అప్ కమింగ్ ఫిల్మ్ లుక్ ఎలా ఉంటుదనేది ఆసక్తికరంగా మారింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ 30 కోసం సన్నద్ధమవుతున్నాడు యంగ్ టైగర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని.. దాని కోసం వెయిట్ లాస్ అవుతున్నాడని మొదటి నుంచి వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవడంతో.. కొత్త లుక్ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురు చేస్తున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే.. ‘ఏ న్యూ డే .. న్యూ వైబ్’ అంటూ ఓ స్టైలిష్ ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు తారక్. అలాగే ఎన్టీఆర్ మేకోవర్ ఫొటోను హెయిర్ స్టెలిష్ట్ ఆలీమ్ హకీమ్ కూడా షేర్ చేసుకున్నాడు. ఈ లుక్‌లో కూలింగ్ గ్లాసెస్‌తో ట్రెండీగా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్. దాంతో క్షణాల్లో ఈ లుక్ సోషల్ మీడియాని షేక్ చేసేసింది. అయితే ఈ లుక్ కాస్త బాద్షా సినిమాలో తారక్‌ను చూసినట్టుంది. అయినా ఈ నయా గెటప్ ఎందుకోసమనేది ఆసక్తికరంగా మారింది. చాలా మంది ఇది కొరటాల సినిమా కోసమేనని భావించారు. కానీ బాద్షా లుక్ కాబట్టి.. ఖచ్చితంగా అదే అని చెప్పలేకపోయారు. అందుకే ఈ లుక్ అసలు కథ వేరే ఉందంటున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఓ యాడ్ షూటింగ్లో పాల్గొంటున్నాడు.. ఓ ప్రముఖ కంపెనికి బ్రాండ్ అంబాసిడర్‌గా చేయబోతున్నాడు. ఆ యాడ్ షూట్ కోసమే.. తారక్ కొత్త గెటప్‌లో దర్శనమిచ్చాడు. అంతే తప్ప.. ఎన్టీఆర్30కి ఇంకా టైం ఉందంటున్నారు. అయినా ఎన్టీఆర్‌ను సరికొత్త లుక్‌లో చూసి మురిసిపోతున్నారు నందమూరి అభిమానులు.