AP: వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు రివర్స్ పాలన నడిచిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో హెక్టారుకు రూ.17 వేలు చొప్పున ఇచ్చారని తెలిపారు. ‘గత ప్రభుత్వంలో రైతులకు ఇచ్చే పరిహారం రూ.12 వేలకు తగ్గించింది. కూటమి వచ్చిన తర్వాత పరిహారం పెంచాం. పీఎం ఫసల్ బీమా యోజన పథకం అమల్లోకి తెచ్చాం. కేంద్రం నిధులు విడుదల చేయగానే మొంథా తుఫాన్ పరిహారం ఇస్తాం’ అని వెల్లడించారు.