Rudrangi Movie : జగపతిబాబు ‘రుద్రంగి’ టీజర్ రిలీజ్
జగపతి బాబు(Jagapati Babu) విలనిజంతో వస్తున్న సినిమా రుద్రంగి (Rudrangi Movie). ఈ సినిమాను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (Rasamai balakishan) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
విలన్(Villan)గా వరుస సినిమాలు చేస్తున్న జగపతి బాబు(Jagapati babu) తాజాగా రుద్రంగి సినిమా(Rudrangi Movie)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ ద్వారా హీరోయిన్ మమతా మోహన్ దాస్(Mamatha mohandas) రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో యువ నటుడు ఆశిష్ గాంధీ, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్(Kalakeya prabhakar) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది.
రుద్రంగి సినిమా టీజర్ :
రుద్రంగి సినిమా (Rudrangi Movie) స్వాతంత్య్ర కాలంనాటి కథాంశంతో తెరకెక్కుతోంది. మూవీ టీజర్ (Teaser) అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో జగపతి బాబు (Jagapati Babu) విచిత్ర హావభావాలతో విలనిజం పండించనున్నాడు. ఇండిపెండెన్స్ బానిసలకు కాదు రాజులకు అంటూ జగపతి బాబు చెప్పే డైలాగ్స్ (Dialoges) ట్రైలర్(Trailer)లో హైలెట్గా నిలిచాయి. ‘గాడు బలవంతుడురా..కానీ నేను భగవంతుడిని రా’ అని జగపతి బాబు (Jagapati Babu) నుంచి వచ్చిన పవర్ ఫుల్ డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
రుద్రంగి సినిమా (Rudrangi Movie)కు అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఎమ్మెల్యే, కవి, గాయకుడు అయిన రసమయి బాలకిషన్ (Rasamai balakishan) నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమా మే 26వ తేదిన థియేటర్లలో విడుదల(Release) కానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు (Posters), పాటలు(Songs) సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.