ASR: ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉత్సవాలు ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఉత్సవాలు కట్టుదిట్టంగా జరగడానికి పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.