పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీమిండియాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోందని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. పాక్‌తో మ్యాచ్‌ల కంటే కూడా ఆఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటున్నాయని తెలిపాడు. ఆసియా కప్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌ను తాను కేవలం 15 ఓవర్లు మాత్రమే చూసి, ఆ తర్వాత ఛానెల్ మార్చి ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ చూశానని చెప్పాడు.