MDK: మోతాదుకు మించి ఎరువులు వాడకం వల్ల చీడపీడల బెడద ఉంటుందని రామాయంపేట ఇంఛార్జ్ వ్యవసాయ డివిజన్ అధికారి రాజు నారాయణ సూచించారు. రైతులు పంటలకు అధిక మోతాదులో ఎరువుల వాడకం చేయవద్దని అన్నారు. ఆకుల రంగు పట్టిక ద్వారా సోమవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆకుల రంగు ఆధారంగా ఎరువుల వాడకంపై అవగాహన పెండుకోవాలని పేర్కొన్నారు.