KKD: సామర్లకోట టిడ్కో కాలనీకి చెందిన దాసరి దుర్గకు విద్యుత్ శాఖ భారీ బిల్లుతో షాక్ ఇచ్చింది. ఆన్ లైన్లో వచ్చిన బిల్లు ఏకంగా రూ. 1.99 కోట్లుగా ఉండటంతో ఆమె షాక్కు గురైంది. ప్రస్తుతం టిడ్కో ఫ్లాట్లో ఎవరూ నివాసం లేకపోయినా ఇంత భారీగా బిల్లు రావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపమా? లేక అధికారుల నిర్లక్ష్యమా? అని స్థానికులు జోరుగా చర్చించుకుంటున్నారు.