NDL: అవుకు మండలంలో రామాపురం గ్రామంలో బనగానపల్లెకు చెందిన ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూపు స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 25 మంది యువకులు రక్తదానం చేశారు. ఆదివారం సాయంత్రం సంస్థ ప్రతినిధులు షాషావళి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు యువకులు రక్తదానాన్ని చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.