బాలీవుడ్ మేకర్స్ ఓ సైన్స్ ఫిక్షన్ పౌరాణిక మూవీ ప్రాజెక్టు(Bollywood project) కోసం సౌత్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రధానంగా అల్లు అర్జున్(Allu Arjun) లేదా జూనియర్ ఎన్టీఆర్(NTR) వైపు చూస్తున్నారని సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌లో సమంతా రూత్ ప్రభు ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఓ బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్(Bollywood project) కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) పేర్లు పరిశీలనలో ఉన్నారనే న్యూస్ ఎగ్జైటింగ్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 మూవీ చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఇక ఇప్పుడు బన్నీ కూడా బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నాడట. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్, ఉరి ఫేమ్ ఆదిత్య ధర్.. ‘ది ఇమ్మోర్టల్స్ అశ్వత్థామ’ పేరుతో ఓ భారీ మైథలాజికల్ మూవీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
చాలా కాలంగా ఈ సినిమాలో విక్కీ కౌశల్ లేదా రణ్‌వీర్‌సింగ్ నటించబోతున్నట్టు వినిపిస్తోంది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలను పక్కకు పెట్టేసి.. బన్నీ లేదా ఎన్టీఆర్‌తో ఈ ప్రాజెక్ట్‌ను సెట్ చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట ఆదిత్య ధర్. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్.. పుష్ప మూవీతో బన్నీ పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ బడా మేకర్స్ వీళ్లతో సినిమాలు చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ‘ది ఇమ్మోర్టల్స్ అశ్వత్థామ’ కోసం బన్నీ, ఎన్టీఆర్ రేసులో ఉన్నట్టు బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి.
ఒకవేళ నిజంగానే బన్నీ లేదా ఎన్టీఆర్ ఈ భారీ ప్రాజెక్ట్ చేస్తే మామూలుగా ఉండదని చెప్పొచ్చు. అలా కాకుండా ఇద్దరితో మల్టీస్టారర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనే డౌట్స్ కూడా రాక మానదు. అలాగే ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా సమంత పేరు కూడా వినిపిస్తోంది. మరి ఇదంతా పుకారేనా? లేదంటే.. నిజంగానే మన హీరోలతో సంప్రదింపులు జరుగుతున్నాయా? అనేది తెలియాల్సి ఉంది.