Nitish kumar:వచ్చే లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరో ఏడాదిలో పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యుహాలతో సిద్దం అయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమిగా ఏర్పడుతున్నాయి. జేడీయూ అధినేత, బీహర్ సీఎం నితీశ్ కుమార్ (Nitish kumar) మెల్లిగా పావులు కదుపుతున్నారు.
నితీశ్ కుమార్ (Nitish kumar) త్వరలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో (kcr) సమావేశం అవుతారని తెలిసింది. వీరిద్దరీ మధ్య లోక్ సభ ఎన్నికల గురించే చర్చ వస్తోంది. ఎన్నికల్లో ఎలా వెళ్లాలి.. సీట్లు ఎలా దక్కించుకోవాలనే అంశంపై డీప్ డిస్కషన్ ఉండనుంది. కేసీఆర్‌తో (kcr) భేటీ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీతో (mamata) కూడా నితీశ్ కుమార్ భేటీ అవుతారట. వారిద్దరూ జాతీయ స్థాయిలో ప్రాంతీయ కూటమి ఏర్పాటు.. లక్ష్యం గురించి చర్చిస్తారని సమాచారం.
బీజేపీ వ్యతిరేక కూటమని ఏర్పాటు చేస్తారు. ఆ పార్టీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీ అధినేతలతో సమావేశం అవుతారు. అన్నీ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు నితీశ్ కుమార్ (Nitish kumar) శక్తిమేరకు ప్రయత్నిస్తున్నారు. నితీశ్‌తో కేసీఆర్ (kcr), మమతా బెనర్జీ (mamata) వస్తారని తెలిసింది. నవీన్ పట్నాయక్ (naveen patnaik), స్టాలిన్ (stalin), అఖిలేశ్ యాదవ్ (akhilesh yadav), కేజ్రీవాల్ (kejriwal), కుమార స్వామి (kumara swamy) కూడా కలిసి వస్తారని పొలిటికల్ ఆనలిస్టులు లెక్కలు చెబుతున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గతంలో వచ్చినన్నీ సీట్లు రావని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వస్తున్నారు. పరిస్థితిని గమనించి ప్రాంతీయ పార్టీలు ఒక్కటి అవుతున్నాయి. కమల దళం మాత్రం.. కూటమితో కలిసి తామే అధికారంలోకి వస్తామని చెబుతోంది. ఎన్నికలు- ఫలితాలపై ఇలా ఎవరీ ధీమాలో వారు ఉన్నారు.