RR: షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామంలో 200 మీటర్ల డ్రైనేజీ పనులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీశైలం ఆవుల శివశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే చొరవతో ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు.