NTR: ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలవుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్లో వివిధ మార్గాలలో ప్రయాణించే మహిళలతో ఆయన మాట్లాడారు. అనంతరం ప్రయాణికులు ‘ఈ పథకం చాలా బాగుందని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని’ తెలిపారు. స్త్రీ శక్తి పథకం మహిళా సాధికారతకు కొత్త ఉత్తేజాన్నిచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు.