KDP: చాపాడులోని ZPHS పాఠశాలలో ఇవాళ 1998 -1999 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా చదువునేర్పిన ఉపాధ్యాయులతో కలసి అప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. తమ కుటుంబ సభ్యుల నేపథ్యం, చదువుకున్న జ్ఞాపకాలు సభాముఖంగా తెలియజేసుకున్నారు. విద్య నేర్పిన ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.