అసోం పర్యటనలో ఉన్న PM మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. 1962లో చైనాతో యుద్ధం తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన తప్పదాలు ఈశాన్య ప్రాంత ప్రజలకు గాయాలుగా మారాయని మండిపడ్డారు. ప్రస్తుత తరం కాంగ్రెస్ ఆ గాయాలపై ఇప్పటికీ ఉప్పు చల్లుతూనే ఉందని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం భారత్ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ జట్టు కట్టిందని.. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ అది బయటపడిందన్నారు.