NRML: దిలావర్పూర్ మండల కేంద్ర పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌కు బైంసా ఎంపీవోగా పదోన్నతి లభించింది. కాగా నిన్న సాయంత్రం జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన పదోన్నతి పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీవో మాట్లాడుతూ.. గ్రామాలలో అభివృద్ధికి కృషి చేస్తామని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.