SRD: జాతీయ లోక్ అదాలత్లో 266 కేసుల్లో 1.50 కోట్లు రికవరీ చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొనే అవకాశం ఉందని చెప్పారు. సైబర్ బాధితులకు న్యాయం చేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కృషి చేస్తుందని పేర్కొన్నారు.