VZM: గజపతినగరంలో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సహకారంతో నేత్రాలియా ఐ కేర్ వద్ద జరిగిన శిబిరంలో డాక్టర్ గిరిజ 90 మంది నేత్ర రోగులను పరీక్షలు జరిపి 51 మందిని కేటరాక్ట్ శస్త్ర చికిత్సకు ఎంపిక చేశారు. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు సాయికుమార్ రేవంత్ తదితరులు పాల్గొన్నారు.