మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు అనగా…. చాలా మంది రాజకీయ నాయకులు పాదయాత్రలు చేయడం చాలా కామన్. ఇప్పటి వరకు చాలా మంది అలా పాదయాత్రలు చేసి ప్రజల మనసులు గెలుచుకున్నారు. అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇలా చాలా మందే ఉన్నారు. వారంతా పాదయాత్రతో విజయం సాధించారు. ఓ వైపు రాహుల్ గాంధీ కూడా జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. వీరి బాటలో లోకేష్ కూడా చేరుతున్నారు.
ఈ సారి చంద్రబాబు తనయుడు లోకేష్ ఏపీలో పాదయాత్ర చేయనున్నారు. కుప్పం నుంచి .. ఇచ్చాపురం వరకూ ఏడాది పాటు ప్రజల మద్యే ఉండే విధంగా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. యువత ఎదుర్కుంటున్న సమస్యలు, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది.
రాష్ట్రంలో రైతాంగం, మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు లేవనెత్తి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు సాగనుంది లోకేష్ పాదయాత్ర. కొంత కాలంగా ఆయన పాదయాత్ర చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.