MBNR: ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం అందించి గొప్పమన్సు చాటుకున్నారు మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్. వివరాలకు వెళ్తే డివిజన్ పరిధిలోని ఊర గుట్ట కాలనికి చెందిన మున్నూరు మోహన్ కూతురి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు.