KMM: ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామం వద్ద శనివారం కురిసిన భారీ వర్షానికి పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉద్ధృతి తగ్గేంత వరకు ప్రయాణం చేయవద్దని సూచించారు. ట్రాక్టర్లను అడ్డుగా ఉంచి ప్రజలను అప్రమత్తం చేశారు.