మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 2,547 కేసుల పరిష్కారం జరిగినట్లు ఎస్పీ జానకి వెల్లడించారు. పరిష్కారమైన కేసులలో కోర్టు విచారణలో ఉన్నవి 252, డ్రంక్ అండ్ డ్రైవ్ 564, పెట్టి కేసులు 1491, కాంప్రమైజ్ కేసులు 193, సైబర్ కేసులు 97 ఉన్నాయన్నారు. రాజీ మార్గమే రాజ మార్గమని ఆమె వెల్లడించారు.