»Somi Reddy Comments On Cm Jagan Mohan Reddy On Police Cases 2023
Somi Reddy: జగన్ కోడి కత్తి రాజకీయాలు చేస్తున్నాడు!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(cm jagan mohan reddy) కోడికత్తి కేసులో నాటకాలు ఆడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(somireddy chandramohan reddy) ఆరోపించారు. ఈ క్రమంలో ఏపీ పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదన్న జగన్..ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థల తీరుపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(cm jagan mohan reddy) పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(somireddy chandramohan reddy) విమర్శల వర్షం కురిపించారు. కోడికత్తితో.. గొడ్డలి వేటుతో రాజకీయాలు చేస్తున్న కుటుంబం వైఎస్ జగన్‌దని మండిపడ్డారు. జాతీయ దర్యాప్తు సంస్థలను, దర్యాప్తును తప్పుబడుతున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని ఆరోపించారు. ఒకప్పుడు రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదన్న జగన్.. ఇప్పుడు మాట మార్చి జాతీయ దర్యాప్తు సంస్థలను తప్పుబడటమేంటని ప్రశ్నించారు.
జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ.. వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉందని అన్నారు. అభివృద్ధిని జగన్ పక్కన బెట్టారని విమర్శించారు. దమ్ముంటే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు వాడి సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కు జోలికి రావొద్దని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కోసం పోరాటం చేసే అకిల పక్ష నాయకులతో చేతులు కలిపేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని చెప్పారు. విశాఖ ఉక్కు కోసం బీఆర్ఎస్ నాయకులు పోరాటం చేస్తే స్వాగతించాలని అన్నారు. వారిపై ఏపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
అలాగే వైసీపీ విధానాలు నచ్చక ఆ పార్టీలో కొందరు నాయకులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వాళ్లు టీడీపీలోకి చేరేందుకు రెడీగా ఉన్నారని వెల్లడించారు. సీనియర్లు వచ్చినప్పటికీ తమకు ఇబ్బంది లేదని.. స్వాగతిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ యువతకు పెద్ద పీఠ వేయబోతుందని వెల్లడించారు.