»Your Gudivada Mla Will Not Build A Road Chandrababu Bought A Candy Casino
chandrababu naidu: మీ బూతుల ఎమ్మెల్యే రోడ్డు వేయడు..కానీ క్యాసినో తెచ్చాడు
ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీలోని గుడివాడ(gudivada)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు(chandrababu naidu) పర్యటించారు. ఈ క్రమంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం హాయంలో ఎస్సీలపై గతంలో కంటే దాడులు పెరిగాయని విమర్శించారు. అనేక రకాలు మాఫీయాలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఏపీలోని గుడివాడ(gudivada)లో అంబేద్కర్ జయంతి సందర్భంగా పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu) వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ బూతుల ఎమ్మెల్యే(MLA) రోడ్డు వేయలేడు కానీ..మీ అందరికీ క్యాసినో మాత్రం తెచ్చాడని ఎద్దేవా చేశారు. మరోవైపు పేకాట క్లబ్బులు కూడా తెచ్చాడని..దీనికి తోడు వైఎస్సార్ నాయకులే గంజాయి పండిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు టీడీపీకి ఓట్లు వేసిన వారిపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుందని విమర్శించారు. ఆ క్రమంలో అప్పుడెమో ముద్దులు..ఇప్పుడెమో పిడి గుద్దులు కురిపిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
ఎస్సీ ఫ్యామిలీలలో ఒక్కరికే అమ్మఒడి స్కీం అమలు చేస్తున్నారని వెల్లడించారు. దీంతోపాటు ఎస్సీ(SC)లపై గతంలో కంటే ప్రస్తుతం దాడులు పెరిగియాని చంద్రబాబు గుర్తు చేశారు. ఎస్సీ అధికారి అచ్చెన్న మృతి చెందితే సీఎం జగన్ అసలు కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అరాచకాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని గుర్తు చేశారు. అంబేద్కర్ కు నిజమైన వారసుడు ఎన్టీఆర్(NTR) అని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు స్వతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్ర పటానికి కర్నూల్ జిల్లాలో నారా లోకేష్(nara lokesh) నివాళులు అర్పించారు. అంబేద్కర్ సమాజంలో ఆధిపత్య ధోరణులపై అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. వివక్షని రూపుమాపడానికి జీవితాంతం ఓ యుద్ధమే చేశారని అన్నారు. స్వేచ్ఛా, సమానత్వం, పౌరహక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించిన మానవతామూర్తి అంబేద్కర్ మహాశయుడి ఆశయసాధనకి కృషి చేద్దామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వివక్ష, పేదరికంలేని సమాజం నిర్మించుదామని వెల్లడించారు.