JGL: వెల్గటూర్ మండలం కిషన్ రావుపేటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెల్గటూర్ నుంచి ధర్మారం వైపు ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు వెళ్తున్నారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి కింద పడ్డారు. దీంతో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కితగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు