కేరళ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి దేవాలయానికి బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడం కలకలం రేపింది. అలాగే అట్టుకల్ ఆలయానికి కూడా బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెండు ఆలయాల్లోనూ తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆలయాలను జల్లెడ పడుతున్నాయి. కాగా, ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్ కార్యాలయానికి కూడా బాంబ్ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.