MDK: ఏడుపాయలలో అమ్మవారిని జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేశ్, అదనపు ఎస్పీ మహేందర్ శనివారం వివిధ సమయాలలో దర్శించుకున్నారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేపట్టారు. వనదుర్గమ్మ ప్రధాన ఆలయం ముందు వరద నీటి ప్రవాహ ప్రాంతాన్ని పరిశీలించారు. తాజా పరిస్థితిని ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకుని, తగు సూచనలు చేశారు.