W.G: తాను చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటే తనలో ఉన్న అపరిచితుడు బయటికి వస్తాడంటూ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శనివారం ఆయన భీమవరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏడు నియోజకవర్గాల్లో తాను ఎంతో అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. తాను చేస్తున్న అభివృద్ధిని హైజాక్ చేయాలని చూస్తే సహించేది లేదని ప్రతిపక్షాలను హెచ్చరించారు.