TPT: పరిశ్రమలు, ప్రభుత్వం కలిసి ముందుకు వెళితేనే ప్రపంచ స్థాయిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందు వరుసలో ఉంటామని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి డా.ఎన్ యువరాజ్ తెలిపారు. గ్లోబల్ స్థాయిలో భారత్ విస్తృతమైన అవకాశాలున్న దేశం తెలిపారు. ఆ అవకాశాలను వాడుకోవాలంటే ప్రస్తుత వ్యవస్థలో సరళీకరణ,ఆన్లైన్ సౌకర్యాలు ఉండాలన్నారు. అప్పుడే దేశం డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తుందని పేర్కొన్నారు.