KRNL: ఎమ్మిగనూరు మార్కెట్ యార్డును ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా యార్డులో వేరుశనగలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం అధికారులు, పాలకవర్గ సభ్యులతో కలిసి ట్రేడ్ మర్చండీస్, హమాలీల సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.