MBNR: విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి విలువలతో జీవితాన్ని గడపాలని మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మోసపూరిత మెసేజీలు, లింకులకు స్పందించకూడదన్నారు.