NTR: విస్సన్నపేటలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరలోనే సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.