అనంతపురం జిల్లా నూతన కలెక్టర్గా ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు తీసుకున్నారు. జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ప్రస్తుత కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బాపట్ల జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే.