ప్రకాశం: రాచర్లలోని శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి దేవస్థానం లక్ష్మమ్మ వనం దాటిన తర్వాత ప్రమాదవశాత్తు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో స్వామివారి దర్శనం అర్ధాంతరంగా ఆపివేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య తెలిపారు. కావున భద్రతా చర్యల దృష్ట్యా భక్తులు సహకరించి దర్శనానికి రావద్దని వారు ఈ సందర్భంగా తెలియజేశారు..