నిన్న అనుష్క శెట్టి సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించగా.. తాజాగా అదే బాటలో మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి నడిచారు. తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. ‘కాలంతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలన్న ఆలోచన నన్ను ప్రభావితం చేసింది. నేను సోషల్ మీడియాకు బానిసగా మారిపోయాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని పేర్కొన్నారు.