MNCL: అర్హులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం చెన్నూర్ లో మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు రాయితీ గ్యాస్ అందిస్తున్నట్లు తెలిపారు.