SRCL: బోయిన పల్లి వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన ముకుంద అనిల్ (22) ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమాకాంత్ కథనం ప్రకారం.. అనిల్ ఏడాది కాలంగా కిరాణ దుకాణం నడుపుతున్నాడు. రెండేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఒంటరి తనం, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం ఉరివేసుకున్నాడు.