ప్రధాని మోదీ తన 3 రోజుల పర్యటనలో భాగంగా మిజోరాం చేరుకున్నారు. ఐజ్వాల్ ఎయిర్పోర్ట్లో గవర్నర్ వీకే సింగ్, సీఎం లాల్డుహోమా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయనకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రధాని మోదీ ఎయిర్పోర్ట్ నుంచే వర్చువల్గా రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.