కర్నూలు జిల్లాలో వలస కూలీల పిల్లల కోసం జిల్లాలో సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నట్లు డీఈఓ ఎస్. శామ్యూల్ పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడుమూరు, పత్తికొండ, ఆదోని తదితర మండలాల్లో ఈ నెల నుంచి ఫిబ్రవరి వరకు హాస్టళ్లు నడపనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల పొదుపు సంఘాలు, ఎన్టీవోలు సెప్టెంబర్ 16 లోపు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేయాలని కోరారు.