VZM: వేపాడ మండలంలో ఉన్న ఎరువులు, పురుగుమందుల దుకాణాలను విజిలెన్స్ సీఐ బి. సింహాచలం, మండల వ్యవసాయ అధికారిణి ఎం. స్వాతి, విస్తృత తనిఖీలు చేశారు. ఎరువులు అధిక ధరలను విక్రయించినా, బ్లాక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులకు హెచ్చరించారు. ఎరువుల సూచక ధరల బోర్డులు రైతులకు కనబడేలా ఉండేలా ఉంచాలని సూచించారు. తనిఖీల్లో సిబ్బంది పాల్గొన్నారు.