రియో ఒలింపిక్స్లో కాంస్యంతో మెరిసిన రెజ్లర్ సాక్షి మాలిక్ తన కుమార్తెకు యోషిడా అని పేరు పెట్టింది. జపాన్ దిగ్గజం సౌరి యోషిడా స్ఫూర్తితోనే తన కుమార్తెకు ఈ పేరు పెట్టినట్లు సాక్షి తెలిపింది. ‘నా కుమార్తె వయసు 8 నెలలు. ఆమె పేరు యోషిడా. రెజ్లింగ్లో నా ఆరాధ్య క్రీడాకారిణి సౌరి యోషిడా స్ఫూర్తితో ఆ పేరు పెట్టా’ అని ఇన్స్టాలో సాక్షి పేర్కొంది.