ATP: జిల్లా వైసీపీ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనంతపురంలో భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీలకు అతీతంగా అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి భాస్కర్ రెడ్డి అని జేసీ తెలిపారు. ఆయన మృతి బాధాకరని పేర్కొన్నారు.