»Cbi Arrests Ys Avinash Reddy Main Supporter Gajjala Udaykumar Reddy And His Father
Viveka Murder Case కీలక పరిణామం.. ఎంపీ అవినాశ్ ప్రధాన అనుచరుడు అరెస్ట్
విచారణ పూర్తయి ఉదయ్ పాత్ర ఉందని గుర్తించిన పోలీసులు తండ్రి కొడుకులను అరెస్ట్చేసినట్లు సమాచారం. ఉదయ్ ను పులివెందుల నుంచి కడప జైలు అతిథిగృహానికి తీసుకెళ్లి విచారణ.
ఏపీ సీఎం జగన్ (YS Jagan) బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది. అటు న్యాయస్థానాల్లోనూ ఇటు సీబీఐ (CBI) విచారణలు కొనసాగుతున్నాయి. ఇంకెన్నాళ్లు ఈ కేసు విచారణ (Investigation) కొనసాగుతుందని న్యాయస్థానాలు నిలదీస్తున్నాయి. ఈ కేసులో ప్రధానంగా వైఎస్సార్ సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని (YS Avinash Reddy) విచారిస్తున్నారు. దాదాపు ఐదారు సార్లు సీబీఐ విచారణను అవినాశ్ రెడ్డి ఎదుర్కొన్నాడు. తాజాగా అతడి ప్రధాన అనుచరుడు సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.
ఈ కేసులో అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అవినాశ్ ను విచారణ చేస్తున్నారు. అవినాశ్ ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిపై (Gajjala Udaykumar Reddy) కూడా అనుమానం ఉంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయ్ కుమార్ రెడ్డితోపాటు అతడి తండ్రి జయప్రకాశ్ రెడ్డిని (Gajjala JayaPrakash Reddy) సీబీఐ అదుపులోకి తీసుకుంది. అయితే ఉదయ్ కుమార్ రెడ్డి మాత్రం ఎంపీ అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డి నివాసంలో ఉన్నాడు. గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించిన అధికారులు ఉదయ్ ను అరెస్ట్ చేశారు.
వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాశ్, శివశంకర్ రెడ్డితోపాటు ఘటనా స్థలానికి ఉదయ్ వెళ్లినట్టు తెలుస్తున్నది. ఆ రోజు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను తీసుకురావడంతో ఉదయ్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఇక వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాశ్ రెడ్డి బ్యాండేజ్ కట్లు కట్టారనే వార్తలు వస్తున్నాయి. ఉదయ్ ను గతంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. విచారణ పూర్తయి ఉదయ్ పాత్ర ఉందని గుర్తించిన పోలీసులు తండ్రి కొడుకులను అరెస్ట్చేసినట్లు సమాచారం. కాగా పులివెందుల (Pulivendula) నుంచి కడప జైలు (Kadapa Prison) అతిథిగృహానికి ఉదయ్ ను తీసుకెళ్లి సీబీఐ విచారణ చేస్తోంది.