BHNG: ఆత్మకూరు మండలం కూరెళ్లలోని పల్లె దవాఖానను కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా MLHP డాక్టర్ అశోక్ విధుల్లో లేకపోవడాన్ని ఆయన గమనించారు. కాగా, ఆయన రోజూ సరిగ్గా విధులకు హాజరుకావట్లేదని తెలుసుకున్న కలెక్టర్ వెంటనే MLHPని సస్పెండ్ చేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు.