KRNL: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్లక్ష్యం చేయొద్దని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులకు సూచించారు. హోలగుందలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండల స్థాయి ప్రజల నుంచి వినుతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో తిమ్మక్క, ఇంజినీర్ పద్మనాభరెడ్డి పాల్గొన్నారు.