HYD: సోషల్ మీడియా వేదికగా ట్రాఫిక్ చలానాలపై 50% డిస్కౌంట్ అందిస్తున్నారనే ప్రచారంపై సైబరాబాద్ పోలీసులు స్పందించారు. అదంతా ఫేక్ న్యూస్ అని, ఇలాంటి వాటిని నమ్మొద్దన్నారు. అంతేకాక.. లోక్ అదాలత్ జరుగుతుందని, ఇది కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ వాటి కేసులకు వర్తిస్తుందని వెల్లడించారు.