PLD: నరసరావుపేటలో దళిత యువకుడు వర్ల సాగరబాబుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు, బాధితులు కరపత్రాలు ఆవిష్కరించాయి. పెదకోదమగుండ్లలో లైన్ మెన్ ఎం.వెంకటేశ్వర్లు బలవంతం చేయడంతో కరెంట్ స్తంభం ఎక్కి కరెంట్ షాక్కు గురై సాగరబాబు రెండు చేతులు, కాళ్లు కోల్పోయారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పీడీఎం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ ఆరోపించారు.