NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది.నాగార్జునసాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589 అడుగుల వద్ద ఉందని శుక్రవారం నాగార్జునసాగర్ డ్యాం అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.