పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు కంప్లీట్ అవకముందే.. వినోదయ సీతమ్ రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలను అనౌన్స్ చేయడమే ఆలస్యం అన్నట్టు.. జెట్ స్పీడ్‌లో షూట్ కంప్లీట్ చేస్తున్నారు పవర్ స్టార్. హరిహర వీరమల్లు సంగతి పక్కన పెడితే.. ఇప్పటికే వినోదయ సీతమ్ షూటింగ్ పూర్తి చేసేశారు. అదే స్పీడ్‌లో ఉస్తాద్ షూటింగ్ కూడా జరుగుతోంది. రీసెంట్‌గానే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ శ్రీలీల కూడా షూటింగ్లో జాయిన్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ పలువురు అభిమానులతో ఫోటోలు దిగారు. అందులో స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్‌లో ఉన్నారు పవన్. దీంతో ఉస్తాద్ లుక్ ఇదేనని.. సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పవన్‌కు సంబంధించిన పోర్షన్ కంప్లీట్ అయిపోయిందని.. బ్రేక్ కూడా ఇచ్చేశాడని సమాచారం. రేపటితో ఈ షెడ్యూల్ అయిపోనుందని అంటున్నారు. ఈ లెక్కన హరీష్ శంకర్ ఈ సినిమాను ఎంత స్పీడ్‌గా చుట్టేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉస్తాద్ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి.. నెక్స్ట్ ఓజి షూటింగ్‌కు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే డైరెక్టర్ సుజీత్ ముంబైలో లొకేషన్స్ సెట్ చేసి పెట్టాడు. ఈ నెల 17 నుంచి ఓజి షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ఓ వారం రోజులు ఉంటుందట. అయితే ఆ వెంటనే హరిహర వీరమల్లు షూటింగ్ ఉంటుందా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది. కానీ పవన్ స్పీడ్ చూస్తుంటే.. అనుకున్న సమయానికే ఈ సినిమాలు షూటింగ్స్ కంప్లీట్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు.