హీరో వరుణ్ తేజ్, లావణ్యలకు బాబు పుట్టడంతో నాగబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘X’లో.. ‘నా ప్రియమైన చిన్నారి.. నువ్వు మా జీవితంలోకి ఉదయపు మంచు బిందువులా అడుగుపెట్టావు. నీ కళ్ళల్లో మా కుటుంబ భవిష్యత్తు సూర్యోదయాన్ని చూస్తున్నాను. మా ఇంటిలోకి వచ్చిన నా చిన్న సింహపు పిల్ల.. నీతో కలిసి అడుగులో అడుగు వేస్తూ, నీ చేయి పట్టుకుని నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని తెలిపారు.